తెరాస పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ నాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దిండిగాల రాజేందర్ ప్రముఖ పాత్ర వహించారు. ఒక్క స్థానం కూడా గెలవలేని పరిస్థితుల నుంచి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానాలలో తెరాస శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమ సారథి - తెరాస
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లాలో దిండిగాల రాజేందర్ ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి దగ్గర ప్రత్యేక గుర్తింపు పొందిన రాజేందర్... ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ ప్రారంభం నుంచి ఉన్న నాయకులలో ముఖ్య నేతగా ఉంటూ.. తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన అభివృద్ధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తానొక పునాదిగా నిలిచారు. మరికొందరు ఉద్యమనాయకులు ఉన్నప్పటికీ వారికి గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: ఎట్టకేలకు ఇల్లు చేరిన కమలేశ్ మృతదేహం