కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కార్యకర్తలతో సమావేశమయ్యారు. సత్తుపల్లిలో క్యాడర్ కోసం ఏం చేయాలో అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీ గెలుపునకు కృషి చేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సత్తుపల్లి తెదేపాకు కంచుకోటగా అభివర్ణించారు. నాయకులు పార్టీ వీడినా... క్యాడర్ పార్టీతోనే ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా సత్తుపల్లిలో తెదేపాను రెండుసార్లు గెలిపించారన్నారు. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విజయకేతనం ఎగురవేసేందుకు కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉండడం సంతోషకరమని చెప్పారు.
తెలుగుదేశానికి కార్యకర్తలే బలం: చంద్రబాబు - tdp leader
తెలుగుదేశానికి కార్యకర్తలే బలమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నేతలెందరు పార్టీని వీడినా కార్యకర్తలు ఎప్పుడూ పార్టీనే నమ్ముకుని ఉన్నారని తెలిపారు.
తెలుగుదేశానికి కార్యకర్తలే బలం