లండన్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఖమ్మం నగరానికి చెందిన శ్రీహర్ష లండన్‌లో పీజీ చదువుతున్నాడు. శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్ ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్‌లో చదువుకుంటున్న శ్రీహర్ష రెండు రోజుల నుంచి కనిపించకుండాపోయాడు. స్థానిక బీచ్‌కు సమీపంలో శ్రీహర్షకు సంబంధించిన ల్యాప్‌ట్యాప్ ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృశ్యం విషయాన్ని శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం ఈ విశయమై ఆరా తీస్తోంది. శ్రీహర్ష అదృశ్యంపై కుటుంబీకులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఉదయ్‌ప్రతాప్‌తో తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడారు. తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చి తండ్రి ఉదయ్ ప్రతాప్ను పరామర్శిస్తున్నారు.
లండన్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం - తెలుగు విద్యార్థి అదృశ్యం
లండన్‌లో తెలుగు విద్యార్థి రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
missing