తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు.. పక్క రాష్ట్రాలకు మాత్రం శూన్యం'

Ministers Fire on BJP leaders: రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించని జాతీయ పార్టీల ఎంపీలు.. ఇప్పుడు రాష్ట్ర పర్యటనలు చేస్తూ ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టాలని చూస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. వారికి రాష్ట్ర ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని సూచించారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పువ్వాడ, సత్యవతి, ఎంపీ నామ నాగేశ్వర రావు పాల్గొన్నారు.

ministers comments on bjp leaders
భాజపా, కాంగ్రెస్​లపై మంత్రుల విమర్శలు

By

Published : May 24, 2022, 1:30 PM IST

ఎన్నికలు దగ్గర పడుతున్నాయని గ్రామాల బాట పడుతున్నారు: తెరాస నేతలు

Ministers Fire on BJP leaders: దావోస్‌ సదస్సులో మంత్రి కేటీఆర్ అడుగుపెట్టగానే రాష్ట్రంలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు ఎగబడుతుంటే.... పక్క రాష్ట్రాల సీఎంలపై ఈగ వాలని పరిస్థితి ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఎద్దేవా చేశారు. ఖమ్మం ఎన్​ఎస్​పీ క్యాంపులో రూ. కోటి 10 లక్షలతో నిర్మించిన గిరిజన భవనాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ నామాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం.. రఘునాథపాలెం మండలంలో "స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌" గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.

'గతంలో పనిచేసిన పాలకులు.. గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెరాస పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే.. అది చూడకుండా పల్లెలను విస్మరించారని విమర్శిస్తున్నారు. పీసీసీ పదవి వచ్చినంత మాత్రాన సీఎం కేసీఆర్​ను విమర్శిస్తే పెద్ద నాయకుడు అవుతారనుకోవడం పొరపాటు. తెలంగాణ వస్తే చీకటి ఏర్పడుతుందన్న నాయకుల రాష్ట్రాలు ఇప్పుడు కరెంటు కోతలతో అల్లాడుతున్నాయి. దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్ అడుగుపెట్టగానే రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఒక్క ప్రాజెక్టు కూడా లేదు.' -పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి

'తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన జాతీయ పార్టీ ఎంపీలు.. కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం సభలో ప్రస్తావించడం లేదు. పార్లమెంటులో ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజలు, సమస్యలు, రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఏనాడు గొంతెత్తలేదు. కానీ ఇక్కడ మాత్రం మాయమాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు.' -నామ నాగేశ్వర రావు, ఖమ్మం ఎంపీ

రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించని వారంతా.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని గ్రామాల బాటపడుతున్నారని మంత్రి సత్యవతి విమర్శించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న వారందరికీ ప్రజలు బుద్ధిచెప్పాల్సిన అవసరమందని ఎంపీ నామా పేర్కొన్నారు.

ఇవీ చదవండి:'ప్రధాని మోదీ విజన్​లో వాళ్లు మాత్రమే ఉంటారు'

అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.420, డీజిల్ రూ.400!

'వరంగల్‌లో.. దేశంలోనే అతిపెద్ద వైద్య కేంద్రం'

ABOUT THE AUTHOR

...view details