తెలంగాణ

telangana

'అక్రమ లేఅవుట్లు వేసిన వారు.. అనుమతులు తీసుకోవాల్సిందే'

By

Published : Jul 15, 2020, 7:54 PM IST

మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లపై సుడా ఆధ్వర్యంలో ఎల్​ఆర్​ఎస్​ మేళా అవగాహన సదస్సు నిర్వహించారు. నూతనంగా లే అవుట్లు చేయించుకోవాల్సిన వారు.. ఖమ్మం పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి పొందాలని స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ చెప్పారు.

suda meeting at khammam disitrict
suda meeting at khammam disitrict

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లపై సుడా ఆధ్వర్యంలో ఎల్​ఆర్​ఎస్​ మేళా అవగాహన సదస్సు నిర్వహించారు. స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ బచ్చు విజయ్​కుమార్​ హాజరై.. పలు అంశాలపై వివరించారు. ఖమ్మం సుడా పరిధిలో అక్రమ లేఅవుట్లు చేసిన వారు.. ఎల్​ఆర్​ఎస్ మేళాలో ప్రభుత్వం ద్వారా పునరుద్ధరణ చేయించుకుని బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందాలని సూచించారు.

నూతనంగా లేఅవుట్లు చేయించుకోవాల్సిన వారు.. ఖమ్మం పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి పొందాలని చెప్పారు. వైరా పట్టణ అభివృద్ధి కోసం పురపాలక సభ్యులు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పట్టణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని, అధికారులు పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పని చేస్తూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details