రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. ఖమ్మం జిల్లాలో 485 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 436 మందికి రెండు రోజుల క్రితం నియామక ఉత్తర్వులు అందించారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీఈవో ప్రియాంక కౌన్సిలింగ్ నిర్వహించి గ్రామాల్లో విధులను కేటాయించారు. ఉద్యోగులు తమకు కేటాయించిన ఊళ్లను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ కావడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో విధుల్లోకి పంచాయతీ కార్యదర్శులు - panchayathi
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు విధుల్లోకి చేరారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ నియామక పత్రాలు అందించారు.
విధుల్లోకి పంచాయతీ కార్యదర్శులు