ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్లో పేదలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. టీపీటీఎఫ్ మండల శాఖ సహకారంతో భూక్యా పంతులు పేదలకు సరకులు అందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీపీటీఎఫ్ జిల్లా నాయకుడు వై.శ్రీనివాస్ అన్నారు.
టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - వీఎం బంజర్ వార్తలు
ఖమ్మం జిల్లా వీఎం బంజర్లో టీపీటీఎఫ్ ఆధ్యర్యంలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
![టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ rice and groceries distribution by tptf in vm banzar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6957953-thumbnail-3x2-asdf.jpg)
టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
విద్యాబోధనతో పాటు సామాజిక సేవలో భాగంగా రాష్ట్రశాఖ పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టినట్టు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్, ఉపసర్పంచ్ వంగా విజయ కుమారి, టీపీటీఎఫ్ నాయకులు శీను, రాము, మహేష్, రాము, ఏవీ రామాచారి, భూపాల్ రెడ్డి, భూక్యా ప్రసాద్, వంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం