తెలంగాణ

telangana

ETV Bharat / state

6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Speech at Madhira Public Meeting : ప్రజల బాధలను కేసీఆర్​ సర్కార్​ పట్టించుకోలేదని.. తెలంగాణ సంపదను పంచుకోవడంలోనే ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రజలే నాయకులని.. ప్రజల కంటే తాము అతీతులం అన్నట్లు మోదీ, కేసీఆర్‌ భావిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Priyanka Gandhi Election Campaign in Telangana
Priyanka Gandhi Speech at Madhira Public Meeting

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 5:14 PM IST

Updated : Nov 25, 2023, 5:24 PM IST

Priyanka Gandhi Speech at Madhira Public Meeting : ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని సోనియా గాంధీ తనతో చెప్పారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేవన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారని.. కానీ అలా జరగలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన కాంగ్రెస్​ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

ప్రజలకు మేలు చేయని బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని మార్చే సమయం, అవకాశం వచ్చింది : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Election Campaign in Telangana : ఈ సందర్భంగా పేదలు ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని చెప్పిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. ఆ హామీని నెరవేర్చలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజల బాధలను కేసీఆర్​ సర్కార్​ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ సంపదను పంచుకోవడంలోనే ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. దేశంలో ప్రజలే నాయకులని.. ప్రజల కంటే అతీతులు అన్నట్లు మోదీ, కేసీఆర్‌భావిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రైతులకు రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్‌ హామీ నెరవేరలేదని.. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర ధరల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలెవరూ సంతోషంగా లేరు : ప్రియాంక గాంధీ

అన్ని పెద్ద ప్రాజెక్టుల్లో అవినీతి..: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆలోచిస్తోందని ప్రియాంక పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థుల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవన్న ఆమె.. ప్రత్యేక రాష్ట్రం వల్ల కేసీఆర్‌ కుటుంబసభ్యులు మాత్రమే బాగుపడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని.. కమీషన్ల పేరుతో ప్రాజెక్టుల్లో భారీ అవినీతి చేశారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ నేతలకు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీ నేతలు కృషి చేయరని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి అగ్రనేతలు

నిన్న రాత్రి సోనియాగాంధీతో మాట్లాడాను. ఎక్కడున్నావు అని నన్ను సోనియా అడిగారు. హైదరాబాద్‌లో ఉన్నా.. రేపు మధిర వెళ్తాను అని చెప్పాను. తెలంగాణ కోసం ప్రజలు ఎంతగా పోరాడారో నాకు తెలుసు అని సోనియా చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేవి. తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. - ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం : ప్రియాంక గాంధీ

ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానం : ప్రియాంక గాంధీ

Last Updated : Nov 25, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details