తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరాలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన - సమస్యలు

వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో సమస్యలపై తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరాలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

By

Published : Aug 11, 2019, 12:03 AM IST

వైరాలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
ఖమ్మం జిల్లా వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా పాఠశాలలో సమస్యలపై నిర్వాహకులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని నిరసన చేపట్టారు. తమ పిల్లలను చూడటానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు అధికారుల తీరుకు నిరసనగా ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎదురుగా ఉన్న వైరా, మధిర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో బాలికలు అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్​ సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని పోలీసులు చెప్పడం వల్ల ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details