మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా నిలుస్తోందని.. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.
'మత్స్యకారుల సంక్షేమం కోసం అండగా ప్రభుత్వం'
ఖమ్మం జిల్లా వైరాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఎమ్మెల్యే రాములునాయక్ రుణాలు పంపిణీ చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
mla ramulu nayak
మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, రాయితీపై వాహనాలు, వలలు అందించారని, మత్స్యకారుల కుటుంబాల్లోని మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రుణసాయం వంటి కార్యక్రమాలు అందుబాటులో తెచ్చారని అన్నారు. మహిళా సంఘానికి రూ.3 లక్షల రుణాలు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం అందించే రుణాలు, రాయితీ పరికరాలు సద్వినియోగం చేసుకోవాలని, మత్స్యకారులు అభివృద్ధి చెందాలని తెలిపారు.
ఇదీ చదవండి:సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట