వలస కూలీలకు ఎలాంటి కలుగకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఏన్కూరు, జూలూరుపాడులలో ఆయన పర్యటించి వలస కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. జూలూరుపాడులో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కూలీలకు వసతులు, వైద్యసదుపాయం కల్పించాలని ఆదేశించారు.
'లాక్‌డౌన్ ముగిసే వరకు వలసకూలీలకు వసతులు కల్పించండి'
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాములునాయక్ పర్యటించారు. వలసకూలీల కష్టాలు అడిగి తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Breaking News
లాక్‌డౌన్ వరకు కూలీలు ఎటూ వెళ్లకుండా చూడడం, వారికి అవసరమైన సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు అందజేయాలన్నారు. ఖమ్మం- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు వద్ద వైద్య సిబ్బంది ఎమ్మెల్యేకు స్క్రీనింగ్ చేశారు. పలుచోట్ల పొలాల వద్ద ఉన్న కూలీలతో ఆయన మాట్లాడారు. కారేపల్లి మండలంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్