ఖమ్మం జిల్లాలో ఇంత వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని.. ఇదే స్ఫూర్తిని జిల్లా ప్రజలు కొనసాగించాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని 26వ డివిజన్లో 520 కుటుంబాలకు కార్పొరేటర్ పగడాల నాగరాజు అందిస్తున్న నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు: మంత్రి పువ్వాడ - మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం జిల్లాలో ఇంత వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ పగడాల నాగరాజు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు: మంత్రి పువ్వాడ
ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పడు ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా పరిశుభ్రతను పాటిస్తూ కరోనాను జిల్లాలోకి రానియ్యకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా లాక్‌డౌన్‌ను పాటించి కరోనాను ఎదుర్కోవాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి: సీరియస్‌గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్