ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ అయ్యప్పస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన మకరజ్యోతి దర్శనం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కర్పూర జ్యోతులను 18మెట్లపై ఏర్పాటుచేసి వెలిగించిన అనంతరం ఆలయ శిఖరంపై ఏర్పాటుచేసిన జ్యోతిని ఆలయ ప్రధాన అర్చకులు వెలిగించారు.
మకర జ్యోతి దర్శనం... సర్వపాప నివారణం - MAKARA JYOTHI DARSHANAM IN KHAMMAM
మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా శ్రీనివాసనగర్‌లోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజారులు మకరజ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

మకర జ్యోతి దర్శనం... సర్వపాప నివారణం
పూర్తిస్థాయిలో జ్యోతి వెలిగించిన అనంతరం ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. జ్యోతిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు రెండు చేతులు జోడించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు అందించారు.
మకర జ్యోతి దర్శనం... సర్వపాప నివారణం
ఇవీచూడండి: 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం