తెలంగాణ

telangana

ETV Bharat / state

చావే శరణ్యం: ఖమ్మం గుత్తేదార్లు - poison

ఖమ్మం నగరపాలక కార్యాలయంలో గుత్తేదార్లు ఆందోళన చేశారు. తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. అప్పులు తెచ్చి పనులు చేశామని.. ఇక చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లులు చెల్లించాలని ఆందోళన చేస్తున్న గుత్తేదార్లు

By

Published : Mar 15, 2019, 6:15 AM IST

Updated : Mar 15, 2019, 7:41 AM IST

బిల్లులు చెల్లించాలని ఆందోళన చేస్తున్న గుత్తేదార్లు
పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ఖమ్మం నగరపాలక కార్యాలయంలో గుత్తేదార్లు నిరసనకు దిగారు. గత ఐదేళ్లుగా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని.. పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. అకౌంట్స్‌ శాఖ గది ముందు బైటాయించారు. తమ బిల్లులు చెల్లించాలని నినాదాలు చేశారు. అప్పులు తెచ్చి పనులు చేశామని.. తమకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నుంచి సుమారు 3 కోట్ల రూపాయలబిల్లులు చెల్లించకుండా తిప్పుతున్నారని గుత్తేదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలంటూ కమిషనర్, మేయర్‌లను వేడుకున్నారు.
Last Updated : Mar 15, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details