ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఖమ్మం కలెక్టర్ అమయ్ కుమార్ పర్యటించారు. లోకవరం పుల్లయ్య బంజారాలో డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. పోచవరంలో వైకుంఠదామానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించారు. చిన్న కోరుకొండలోని నర్సరీ నిర్వహణ చూసి సర్పంచి వేము రత్తమ్మను అభినందించారు. చెన్నూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయని... ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు దాతల సాయంతో ట్రాక్టర్ కొనుగోలు చేయాలని సర్పంచులకు సూచించారు.
పల్లె ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్ - khammam collecter visit palle pragathi programm in kalluru
రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా... కల్లూరు మండలంలో కలెక్టర్ అమయ్ కుమార్ పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సర్పంచిలకు సూచించారు.
![పల్లె ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్ పల్లె ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5653596-thumbnail-3x2-collecter.jpg)
పల్లె ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్