ETV Bharat / state

రసవత్తరంగా నిజామాబాద్ మున్సిపల్ పోరు - పురపోరు

పార్టీల పొత్తులు, ఎత్తులు, వ్యూహాలతో  నిజామాబాద్‌ నగర పోరు ఆసక్తి రేపుతోంది. అభివృద్ధే గెలిపిస్తుందని... గులాబీదళం దీమా వ్యక్తం చేస్తుంటే... అస్తవ్యస్తంగా మారిన ప్రగతి పనులే  ప్రచారాస్త్రమని విపక్షాలు విశ్వాసంతో ఉన్నాయి. తెరాస సహకారంతో మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకోవాలని మజ్లిస్‌ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

తెరాస అభివృద్ధి మంత్రం..సమస్యలే విపక్షాల ప్రచారాస్త్రం..​
NIZAMABAD READY FOR MUNICIPAL ELECTIONS
author img

By

Published : Jan 9, 2020, 7:04 PM IST

తెరాస అభివృద్ధి మంత్రం..సమస్యలే విపక్షాల ప్రచారాస్త్రం..​

ఎన్నికల ముంగిట నిలిచిన నిజామాబాద్‌ పాలక సంస్థకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. 1931లోనే ఇందూరు మున్సిపాలిటీ ఏర్పడినప్పటికీ...1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1987లో 36 వార్డులతో రెండో గ్రేడ్ మున్సిపాలిటీగా ఎదిగింది. 2005 మార్చిలో 50 డివిజన్లతో నగర పాలక సంస్థగా ఉన్నతి సాధించింది. 2019లో నగర పాలక సంస్థ పరిధిలోకి నగరానికి సమీపంలోని 9 గ్రామ పంచాయతీలను నగర పాలక సంస్థలో విలీనంతో మరి విస్తృతమైంది. ప్రస్తుతం ఇందూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా.... 3లక్షల 6వేల 544 మంది ఓటర్లు ఉన్నారు. మేయర్ పదవి ఈసారి కూడా బీసీ మహిళకు రిజర్వ్ అయింది.

పదేళ్లుగా కంపుకొడుతున్న భూగర్భ నీటి వ్యవస్థ

పదేళ్లుగా సాగుతున్న భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులతో నగర వాసులకు అవస్థలు తప్పడం లేదు. 200కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులు 2008లో 94కోట్ల వ్యయంతో చేపట్టగా.. అంతర్గత పనులకే పరిమితమయ్యారు. 2016లో మళ్లీ 107 కోట్లతో పనులు చేపట్టగా.. ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. భూగర్భ వ్యవస్థ కోసం ప్రధాన రహదారులతోపాటు, అంతర్గత రహదారులను పూర్తిగా తవ్వేశారు. ప్రధాన రహదారులు పునరుద్ధరించినప్పటికీ అంతర్గత రహదారుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రెండు ఎస్టీపీలు సిద్ధం కాగా.... మరో నిర్మాణం సాగుతోంది. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, ఉద్యానవనాలు, ఫుట్ పాత్ లు, వైకుంఠదామాల వంటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఏళ్లుగా సాగుతున్న సుందరీకరణ పనులు ప్రజలకు పరీక్షగా మారాయి.

2019-20 సంవత్సరానికి నగర పాలక సంస్థ బడ్జెట్ 567.23కోట్లు. గత 2019-20లో నగర పాలక సంస్థ ఆదాయం 36.20 కోట్లు కాగా మిగతాది అంతా వివిధ గ్రాంట్‌లు, ఆర్థిక సంఘం నిధులు, అమృత్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నిధుల ఆధారంగా అంచనా బడ్జెట్ రూపొందించారు. ఇందులో దాదాపు 124కోట్ల వరకు రెవెన్యూ ఖర్చులకే పోతుంది. మిగతా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

నిజామాబాద్ పీఠం కోసం ఎత్తులు పైఎత్తులు

మరోవైపు నిజామాబాద్‌ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెరాస, మజ్లిస్, భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నెలకొంది. తెరాస, మజ్లిస్​ పరస్పర అవగాహనతో ముందుకెళ్తుండగా.. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టంపై మజ్లిస్, భాజపాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతోంది. మజ్లిస్‌కు సీఏఏ అంశంలో తెరాస మద్ధతు ఇవ్వడంతో ఆ పార్టీ వైఖరి తేలిపోగా.. తెరాస, మజ్లిస్ లను ఒకచోట చేర్చి భాజపా విమర్శలు చేస్తోంది. తెరాసకు వలసలు ప్రధాన సమస్యగా మారుతుండగా.. భాజపా గట్టి అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. కార్పొరేషన్‌ను మళ్లీ కైవసం చేసుకోవాలని తెరాస పట్టుదలతో ఉంది. తమ సత్తా చాటి పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

దాదాపు సగం వార్డుల్లో గట్టి పట్టున్న ఎంఐఎం మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో తెరాసకు బలం లేకున్నా మేయర్ పదవి దక్కేలా సహకరించిన ఎంఐఎం.. ఈసారి తమకు సహకరించాలని తెరాసను కోరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఎంఐఎం మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా అభివృద్ధి అంశాలు, పార్టీల వ్యూహాలతో నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.