తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 9:42 PM IST

ETV Bharat / state

కుక్కకు ఘనంగా అంత్యక్రియలు

మనిషి చనిపోయినా పట్టించుకోని ఈ రోజుల్లో... ఓ కుక్కకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు అన్నం సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు. అన్ని లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

funeral for dog in khammam district
కుక్కకు ఘనంగా అంత్యక్రియలు

సాటి మనిషి చనిపోతేనే పట్టించుకోని ఈ రోజుల్లో.. ఓ శునకం చనిపోతే కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఖమ్మంలో అన్న సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓ కుక్కకు అంతిమ వీడ్కోలు పలికారు. నగరానికి చెందిన ఒక కుటుంబం తమ పెంపుడు శునకం చనిపోతే అన్నం సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాస రావుకు అప్పగించారు.

సంస్థ సభ్యులతో కలిసి ఆయన ఆ కుక్కకు అంత్యక్రియలు చేశారు. సాగర్ కాలువలో స్నానం చేయించి పసుపు కుంకుమ పూసి, పూలు చల్లి, తెల్లని వస్త్రంలో చుట్టి ఖననం చేశారు. ప్రకృతిలో మనుషులతో పాటు సహజీవనం చేసే జంతువులకు గౌరవంగా అంతిమ వీడ్కోలు తెలపాలని శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.

కుక్కకు ఘనంగా అంత్యక్రియలు

ఇవీ చూడండి: అదనపు కట్నం ఇవ్వలేదని రెండో పెళ్లి..

ABOUT THE AUTHOR

...view details