ఖమ్మం జిల్లా కొణిజర్లలోని ప్రధాన కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గేదెల లోడుతో వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి.. ఓ టాటా ఏస్ వాహనం, ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది.
డీసీఎం ఢీకొని ఐదుగురికి గాయాలు - updated news on DCM vehicle collides .. Five injured
డీసీఎం అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
![డీసీఎం ఢీకొని ఐదుగురికి గాయాలు DCM vehicle collides .. Five injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5849219-19-5849219-1580031896631.jpg)
డీసీఎం వాహనం ఢీకొని.. ఐదుగురికి గాయాలు
ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డీసీఎం వాహనం ఢీకొని.. ఐదుగురికి గాయాలు
ఇవీ చూడండి: అనతికాలంలోనే రాష్ట్రంలో అత్యున్నత ఫలితాలు: తమిళిసై