తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం కోసం ఆరాటం సరే.. కరోనాపై పోరాటం ఏది?

లాక్​డౌన్​ వార్త వినగానే కరోనా నిబంధనలను తుంగలో తొక్కేశారు మందుబాబులు. రోజురోజుకు పెరిగిపోతోన్న కొవిడ్​ వ్యాప్తిని మరచి మద్యం సీసాల కోసం దుకాణాల ముందు ఎగబడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో ప్రత్యక్షమైంది.

By

Published : May 11, 2021, 5:22 PM IST

croud at liquor shops, Khammam district, wyra news
croud at liquor shops, Khammam district, wyra news

రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించడంతో మందుబాబులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తిగా లాక్​డౌన్ ఉంటుందనే ఆలోచనతో గతేడాది పరిస్థితులను తలచుకొని ఉదయం నుంచే మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఖమ్మం జిల్లా వైరాలో మద్యం దుకాణాల వద్దకు మందుబాబులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

కరోనా నిబంధనలు పట్టించుకోకుండా పెద్దమొత్తంలో మద్యం సీసాలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. వైరాతో పాటు పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టాల్సిన దుకాణదారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​కు సిద్ధమవుతున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details