తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2020, 1:08 PM IST

ETV Bharat / state

'అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే నాణ్యత లేని సీసీరోడ్లు'

నాణ్యత లేని సీసీరోడ్లు నిర్మిస్తున్నారని ఖమ్మం జిల్లా వైరా పురపాలికలోని ఒకటో వార్డులో స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ సంఘటనాస్థలికి చేరుకుని పనులను పరిశీలించారు.

quality less cc roads in wyra municipality
వైరా పురపాలికలో నాణ్యత లేని సీసీరోడ్లు

ఖమ్మం జిల్లా వైరా పురపాలిక పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఒకటో వార్డులో నాణ్యత లేకుండా సీసీ రహదారులు నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువాళ్ల దుర్గా ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. పనుల్లో నాణ్యత లేదని ఆరోపించారు. వైరా మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో నిర్మిస్తున్న సీసీరోడ్లు నాణ్యత లోపంతో ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరుగుతోందని మండిపడ్డారు.

కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులు నాసిరకంగా చేస్తున్నారని దుర్గా ప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని అభివృద్ధి పనులను పర్యవేక్షించి, నాణ్యత లోపం లేకుండా రోడ్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలోని రెండో వార్డులో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను స్థానికులు అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details