కరోనా ప్రభావంతో ప్రభుత్వం పిలుపునిచ్చిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఏటీఎంలు, రైతు బజార్లు, జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చల్లుతున్నారు. బ్లీచింగ్ చల్లుతూ రక్షణ చర్యలనూ తీసుకుంటున్నారు. జనసమూహం తగ్గడం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్డుపైకి వచ్చే వాహనాలను ఆపుతున్న పోలీసులు... కారణాలు తెలుసుకున్నాకే అనుమతిస్తున్నారు.
ఖమ్మంలో వీధులన్నీ నిర్మానుష్యం
ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం పిలుపునిచ్చిన లాక్ డౌన్ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా జన సమ్మర్దం అధికంగా ఉన్న చోట స్ప్రే చల్లుతున్నారు. బ్లీచింగ్ సైతం చల్లుతూ పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
జనసమూహం ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ స్ప్రే