తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండోరోజూ నిరసనలు.. గ్యాస్​ సిలిండర్​ను ఉరి తీసి, పాడె కట్టిన బీఆర్​ఎస్​ నేతలు - trending video gas price inctrease protest

BRS leaders staged dharna in Khammam: గ్యాస్​ సిలిండర్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలు రెండో రోజూ కొనసాగాయి. పలుచోట్ల వినూత్నంగా ఆందోళనలు చేపట్టారు. గ్యాస్​ సిలిండర్​ను​ ఉరి తీసి, పాడె కట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.

BRS leaders staged dharna in Khammam
గ్యాస్ బండలు కట్టెల మోపులతో నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్​ఎస్​

By

Published : Mar 3, 2023, 1:43 PM IST

Updated : Mar 3, 2023, 2:11 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్​ ధరల పెంపుపై నిరసన తెలుపుతున్న బీఆర్​ఎస్​ నేతలు

BRS leaders staged dharna in Khammam: పెరిగిన గ్యాస్‌ ధరలు, కేంద్రం తీరును నిరసిస్తూ అధికార బీఆర్​ఎస్​ ఆందోళనలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనను చేపట్టాయి. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. గ్యాస్ సిలిండర్​ను ఉరితీసి.. మరో సిలిండర్​ను పాడెపై ఊరేగిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో గ్యాస్ ధర రూ.500 నుంచి రూ.1200కు చేరిందని ఆరోపించారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకే కార్పెట్ వేస్తుందని.. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలను గాలికి వదిలేసిందని విమర్శించారు.

మహిళల నిరసన:పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా.. హైదరాబాద్ కోఠిలో బీఆర్​ఎస్​ పార్టీ మహిళలు వినూత్నంగా నిరసనకు దిగారు. రెండో రోజు గోషామహల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు నిరసన కొనసాగించారు. కోఠిలో గ్యాస్ లోడ్​తో వెళ్తున్న ఆటోను.. బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకురాలు శీలం సరస్వతితో పాటు పలువురు మహిళలు అడ్డుకున్నారు. ఆటో డ్రైవర్, కార్మికుడు కూడా మహిళలకు మద్దతుగా గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద, సామాన్య తరగతి ప్రజలకు పెను భారంగా మారిన పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

హోం శాఖ మంత్రి నిరసన:గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు. ట్యాంక్ బండ్​పై ఉన్న అంబేడ్కర్​ విగ్రహం వద్ద జరిగిన మహా ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు కట్టెల మోపు, ఖాళీ సిలిండర్ పట్టుకొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి బదులు.. ప్రజలపై నానా భారాలు మోపుతోందని హోంమంత్రి ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ప్రతి రంగంలోనూ అద్భుతంగా అభివృద్ధి చెందుతుండగా.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాల వల్ల దేశ భవిష్యత్తు అధోగతి పాలైందన్నారు. కేంద్ర విధానాలైన నోట్ల రద్దు, జీఎస్టీ, వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో ప్రజలు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర నిరసన:ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో బీఆర్​ఎస్​ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సత్తుపల్లి పరిధిలోని తల్లాడలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖాళీ గ్యాస్‌ బండలు, కట్టెల మోపులు మోస్తూ నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించని పక్షంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 3, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details