తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: పూర్వ ఖమ్మం జిల్లా పాలికలన్నీ తెరాసకే.! - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ఛైర్మన్లు, వైస్​ ఛైర్మన్లు తెరాస కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.

Bastika Bad Shah: trs win in the joint Khammam district
బస్తీకా బాద్​షా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఛైర్మన్లు, వైస్​ ఛైర్మన్లు తెరాసకే సొంతం

By

Published : Jan 27, 2020, 5:11 PM IST

ఇల్లెందు
ఖమ్మం జిల్లా ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్‌గా దమ్మాలపాటి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా జానీ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా వేల్పుల దామోదర్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

వైరా
వైరా మున్సిపల్‌ ఛైర్మన్‌గా సుతగాని జైపాల్, వైరా మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ముళ్లపాటి సీతారాములు ఎన్నికయ్యారు. వారిచే జిల్లా కలెక్టర్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

మధిర
మధిర మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మొండితోక లలిత, మధిర మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా వై.విద్యాలత ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్​ వారిచే ప్రమాణ స్వీకారం చేశారు.

సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా కూసుంపూడి మహేష్, సత్తుపల్లి మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సుజలరాణి ఎన్నికయ్యారు. వారు జిల్లా కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఛైర్మన్లు, వైస్​ ఛైర్మన్లు గెలిచిన స్థానాలు

ఇదీ చూడండి : 'మండలి చాలా అవసరం': అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్

ABOUT THE AUTHOR

...view details