ఆరేళ్లుగా మట్టి వినాయకున్ని ప్రతిష్ఠిస్తోన్న యంగ్ స్టార్ యూత్ కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి యంగ్‌స్టార్ యూత్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ కోసం ఆరేళ్ల నుంచి మట్టి వినాయకులనే పూజిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పూజా విధానాల్లోనూ వీరు ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛభారత్, హరితహారం లాంటి పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.
పర్యావరణంపై ప్రత్యేక దృష్టి..
అందరిలానే యంగ్‌స్టార్ యూత్ సభ్యులూ ప్రతిఏటా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. అయితే వీరి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణ సైతం ఉంటుంది. రంగురంగుల వినాయకులను కాకుండా మట్టి గణపయ్యనే ప్రతిష్ఠిస్తున్నారు.
వీరి పూజలూ ప్రత్యేకమే...
అందరిలో భక్తిభావం పెంచేలా వీరు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గణనాథుని ముందు.. వస్ర్తాలు, బియ్యంతోపాటు చిన్నిచిన్ని వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి వీటన్నింటిని ఓ సింహాసనంలో ఉంచుతారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేవరకు నిత్యాభిషేకాలు నిర్వహిస్తారు. చివరిరోజున భక్తులకు పంపిణీ చేస్తారు. భక్తులు వీటిని తమ ఇళ్లలో ఉంచుకుని ప్రతిరోజూ పూజిస్తారు.
నవరాత్రుల సమయంలో ఈ సంఘం సభ్యులు స్వచ్ఛ భారత్, హరితహారం వంటి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం.
ఇదీచూడండి: గల్లీ గల్లీలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు