కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని క్రైస్తవులను కోరారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి పాస్టర్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బలహీన వర్గాలు, మైనార్టీలు, కాంగ్రెస్ పార్టీకే ఓటేసి ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్‌కే ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించండి: పొన్నం - karimnagar congress
పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక చర్చిలోని క్రైస్తవ సోదర సోదరీమణులను కలిసి తనను గెలిపించాలని కోరారు.
బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి : పొన్నం