తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2021, 7:46 PM IST

ETV Bharat / state

కుంటలో చేపలు మృతి.. సుమారు 2లక్షల నష్టం

కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి లోకరావుకుంటలో చేపలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. విష ప్రయోగంతో సుమారు 10 క్వింటాళ్ల వరకు మరణించినట్లు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు పెసర కుమారస్వామి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుంటలో చేపలు మృతి.. విష ప్రయోగమేనా?
కుంటలో చేపలు మృతి.. విష ప్రయోగమేనా?

చేపలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ లోకరావుకుంటలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటంతో 10 క్వింటాళ్ల వరకు చేపలు మరణించినట్లు మండల మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు పెసర కుమారస్వామి వెల్లడించారు.

సుమారు రెండు లక్షల దాకా నష్టం వాటిల్లిందని వాపోయారు. కుంటను ఎస్సై ప్రశాంత్ రావు పరిశీలించి నీటి నమూనాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఘటనా స్థలిలో రేగుల సమ్మయ్య, తిరుపతి, శ్రీనివాస్, పెసరి కొమురయ్య, నీర్ల సతీష్ ఉన్నారు.

ఇదీ చూడండి:సూర్యాపేట ఘటనలో కోలుకుంటున్న బాధితులు

ABOUT THE AUTHOR

...view details