గర్భిణీల సుఖప్రసవాల్లో ఉత్తమ వైద్య సేవలందిస్తున్నందుకు రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కరీంనగర్ జిల్లా గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు.
'గ్రామీణ ప్రాంతాల్లో వెల్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం' - మంత్రి ఈటల రాజేందర్ గంగాధర పర్యటన
గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు, వెల్నెస్ కేంద్రాల స్థాయి పెంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
!['గ్రామీణ ప్రాంతాల్లో వెల్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం' telangana health minister etala rajender visited gangadhara government hospital in karimnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5464740-thumbnail-3x2-krnetala.jpg)
గంగాధర ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల
గంగాధర ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల
జాతీయ కాయకల్ప అవార్డుతో పాటు నాణ్యమైన వైద్యసేవలందించడంలో గంగాధర ప్రాథమిక కేంద్రం జాతీయ పురస్కారం అందుకుంది.
ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీసిన మంత్రి.. కేంద్రంలో పరిశుభ్రతను పరిశీలించారు. ఆస్పత్రి వ్యర్థాలను నిల్వ చేసే విధానాన్ని గమనించారు. గ్రామీణ ప్రాంతాల్లో వెల్నెస్ కేంద్రాల స్థాయి పెంచి మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామని ఈటల తెలిపారు.
- ఇదీ చూడండి : ఖమ్మంలో మరోమారు మంత్రి పువ్వాడ సైకిల్ పర్యటన