ఖమ్మం నగరంలో గుంతలమయంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయకపోతే.. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. నగర శివారు ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు వెంటనే ప్రక్షాళన పనులు చేపట్టాలని, తాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలకు పైప్‌లైన్ వేయాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం నగరంలో తెల్లవారుజామున మంత్రి మరోసారి సైకిల్ పర్యటన చేపట్టారు.
దాదాపు రెండున్నర గంటల పాటు పలు వీధుల్లో పర్యటించారు. మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌తో కలిసి
సైకిల్‌పై తిరుగుతూ.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా మద్యం సీసాలు కనిపించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు.
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే లక్ష్యంగా సైకిల్ యాత్ర చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. నగరంలో దాదాపు రూ. 100 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. త్వరలోనే కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామంటున్న పువ్వాడతో ఈటీవీ భారత్ ప్రతినిధి లింగయ్య ముఖాముఖి...
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు