కరీంనగర్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వార్ల కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులకు.. తలంబ్రాలను సమర్పించారు. మంత్రి గంగుల కమలాకర్ సతీమణి రజిత ఈ వేడుకలో పాల్గొన్నారు.
కరీంనగర్లో ఘనంగా వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం - మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం నాడు.. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వార్ల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకను చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
కరీంనగర్లో ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం
ఆలయ ప్రాంగణమంతా అన్నమయ్య కీర్తనలు, గోవింద నామస్మరణలతో మార్మోగింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చూడండి:మహా శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు