నేడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు (Siricedu) గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (Ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys Sharmila) నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం- నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో భాగంగా ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు.
Ys Sharmila: నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో షర్మిల నిరాహార దీక్ష
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో నేడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం- నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో ఆమె పాల్గొంటున్నారు.
షర్మిల నిరాహార దీక్ష
సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ గ్రామంలో వైఎస్ షర్మిల ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు వైఎస్ షర్మిల గతంలో చెప్పారు.
ఇదీ చదవండి:KRMB, GRMB: గెజిట్ అమలుకు రెండు రాష్ట్రాలు సహకరించాలి: బోర్డులు
Last Updated : Aug 10, 2021, 5:24 AM IST