తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగకున్నా బ్రీత్ ఎనలైజర్​లో 83శాతం రీడింగ్ - samme

మద్యం తాగే అలవాటు లేని వ్యక్తికి.. విధుల్లో భాగంగా బ్రీత్​ ఎనలైజర్​ పరీక్ష చేస్తే 83 శాతం రీడింగ్ నమోదైంది. ఈ ఘటనతో ఆయనను విధుల నుంచి పక్కకు పెట్టారు.

ఆర్టీసీ డ్రైావర్ల సమ్మె

By

Published : May 29, 2019, 1:27 PM IST

కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్​గా పనిచేస్తున్న రమేశ్​కు విధుల్లో భాగంగా శ్వాస విశ్లేషణ పరీక్ష నిర్వహించారు. బ్రీత్​ ఎనలైజర్​లో 83 శాతం రీడింగ్ నమోదైంది. అధికారులు అతనిని విధుల నుంచి పక్కన పెట్టారు. అసలు ఆయనకు మద్యం సేవించే అలవాటు లేదు. ఆందోళన చెందిన రమేశ్ వెంటనే ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి మరోసారి బ్రీత్​ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్నారు. అక్కడ రీడింగ్​లో సున్నా వచ్చింది.

తెలంగాణ మజ్దూర్ యూనియన్​ నాయకులతో కలిసి డిపో ముందు ఆందోళన చేపట్టాడు. అనంతరం నిర్వహణ అధికారి ప్రసాద్​ను కలిశాడు. బ్రీత్​ ఎనలైజర్లను మారుస్తామని ప్రసాద్ తెలిపారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని బస్సులు ఆపడం సరికాదని ఆయన సూచించారు.

'పనిచేయని బ్రీత్ ఎనలైజర్స్​తో పరీక్షలా?'

ఇదీ చూడండి: తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పారు: భట్టి

ABOUT THE AUTHOR

...view details