తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యేక ప్రార్థనలు.. చిన్నాపెద్దా పండుగ శుభాకాంక్షలు - cp

రంజాన్​ను పురస్కరించుకుని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు, పెద్దలు అలింగనం చేసుకుంటూ ఈద్​ ముబారక్​ చెప్పుకున్నారు.

రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

By

Published : Jun 5, 2019, 8:39 PM IST

కరీంనగర్‌లో సాలెహ్‌నగర్‌ ఈద్గ వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో చలువ పందిళ్లను ఏర్పాటు చేయని కారణంగా ఎండ తీవ్రతతో ప్రార్థనా సమయంలో కొంత ఇబ్బంది పడ్డారు. దాదాపు రెండుగంటలు ఎండలోనే కూర్చున్నారు. అనంతరం చిన్నారులు, పెద్దలు అలింగనం చేసుకుంటూ ఈద్‌ ముబారక్‌ చెప్పుకున్నారు. ప్రార్థన స్థలాల వద్ద ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

ABOUT THE AUTHOR

...view details