వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో గత వారం రోజులుగా నిత్యం వర్షాలు కురిసి ఇళ్లలోకి వరద చేరుకుంటోంది. లక్ష్మీదేవిపల్లి గ్రామస్థులు కట్టుబట్టలతో నిలిచారు. ఎస్సారెస్పీ వరదాకాలువ వైపు ఉన్న సహజ ప్రవాహం నిలిపి దారి మళ్లించటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రామడుగు మండలంలోని మాడిశెట్టిపల్లి గ్రామస్థులు కూడా వరద సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు వంద ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఎస్సారెస్పీ వరద కాలువ ఏర్పాటు చేసిన దశాబ్ద కాలంగా సమీప గ్రామాల ప్రజలు వర్షాకాలంలో తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.
భారీ వర్షాలతో ఇండ్లలోకి చేరిన నీరు - VARSHAM
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లా తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లో వరద నీరు ఇండ్లలోకి చేరింది.
భారీ వర్షాలతో ఇండ్లలోకి చేరిన నీరు