తెలంగాణ

telangana

ETV Bharat / state

లోయర్ మానేరు డ్యాం వద్ద రోబోట్ పోలీస్..!

కరీంనగర్​ లోయర్​ మానేరు డ్యాం అందాలను తిలకించేందుకు వచ్చిన వారి రక్షణ కోసం పోలీస్​ శాఖ ప్రత్యేక మరబొమ్మను ఏర్పాటు చేశారు. పోలీస్ మరబొమ్మ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

police-robot-at-lower-maneru-dam-in-karimnagar
లోయర్ మానేరు డ్యాం వద్ద రోబోట్ పోలీస్ ..!

By

Published : Jan 19, 2020, 7:10 PM IST

ఇక్కడ చూస్తున్నది మరబొమ్మ అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే.. కరీంనగర్​లోని లోయర్ మానేరు డ్యాం ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన వారి రక్షణ కోసమే పోలీస్​ శాఖ వారు ఈ పోలీస్ రోబోట్​ను ఏర్పాటు చేశారు.

మరబొమ్మే కదా! మనల్ని ఏం చేస్తది అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే... ఇక్కడే అసలు మతలబుంది. ఈ రోబోట్ కళ్లల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి... వేరే చోట నుంచి పోలీసులు దీనిని పర్యవేక్షిస్తుంటారు.

హైదరాబాద్-వరంగల్​ రహదారికి ఆనుకుని ఉన్న ఈ కట్టడాన్ని తిలకించేందుకు రోజూ వందలాది మంది పర్యటకులు వస్తుంటారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఇక్కడకు వస్తారు. వారి రక్షణ కోసమే రోబోట్​ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లోయర్ మానేరు డ్యాం వద్ద రోబోట్ పోలీస్ ..!

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

ABOUT THE AUTHOR

...view details