etela rajender fires on cm kcr మార్పునకు నాంది కరీంనగర్.. డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా కరీంనగర్.. అంటూ ప్రసంగం మొదలు పెట్టారు ఈటల రాజేందర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడుత ప్రజా సంగ్రామ పాదయత్ర ముగింపు సభ కరీంనగర్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఈటల రాజేందర్... ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌లో రూ.4వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు కేసీఆర్ చెంపచెల్లుమనిపించారని అభిప్రాయపడ్డారు. 8 ఏళ్లలో రూ.లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం నిధులతోనే శ్మశాన వాటికలు సహా ఇతర నిర్మాణాలు జరిగాయి. తెలంగాణ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నోరు విప్పాలి. కేసీఆర్...పార్టీల మధ్య ఇనుప కంచెలుపెట్టి చిచ్చుపెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేశారు. ప్రజలు పోరాటం చేసి హెచ్చరిస్తే తప్పా అరాచకాలు ఆగవు. - ఈటల రాజేందర్, ఎమ్మెల్యే