తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూరాబాద్​లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం - మంత్రి ఈటలపై తాజా వార్తలు

హుజూరాబాద్​లోని ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈటల రాజేందర్​ ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు.

Minister of Health Services opens aarogya sri services at hujurabad
ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించిన మంత్రి ఈటల

By

Published : Dec 15, 2019, 11:43 AM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక ఎక్స్‌రే, ఆప్తమాలజీ, ఐసీయూ కేంద్రాలను ప్రారంభించారు. ఎక్స్‌రే, ఆప్తమాలజీ యంత్రాలను ఆయన పరిశీలించారు.


ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు.

ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించిన మంత్రి ఈటల

ఇవీ చూడండి : గంగా ప్రక్షాళనపై నరేంద్ర మోదీ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details