ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జాతీయ గంగా మండలి మొట్టమొదటిసారిగా సమావేశమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో నమామి గంగే ప్రాజెక్టు ద్వారా గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. నదిని శుభ్రపరిచేందుకు తీసుకున్న చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మోదీ.
అనంతరం నమామి గంగే కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు ప్రధాని. గంగా తీరంలో నిర్మిస్తున్న అటల్ ఘాట్ పనుల పురోగతిని పరిశీలించారు. అర్ధగంటపాటు నదిలో ప్రయాణించారు మోదీ.
ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్, గజేంద్ర సింగ్ షెకావత్, మన్సుఖ్ మాండవీయ తదితరులు హాజరయ్యారు.
కాన్పుర్‌లో గంగానది ప్రమాదకరస్థాయిలో కలుషితమై ఉండేది. అయితే నమామి గంగే కార్యక్రమం అనంతరం కాలుష్యం తగ్గుముఖం పట్టింది.
ఇదీ చూడండి: 'పౌర చట్టం, ఎన్ఆర్సీని బంగాల్లో అమలు చేయం'