దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 32 జిల్లా పరిషత్ ఛైర్మన్లను కైవసం చేసుకున్న పార్టీ తెరాస అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ యంత్రాంగమంతా కార్యకర్తలు, ప్రజల సహకారంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఐక్యతతో పని చేయాలని సూచించారు.
గెలిచే పార్టీకే పోటీ ఎక్కువ: మంత్రి ఈటల - మంత్రి ఈటల రాజేందర్
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస ఏ ఫలితమైతే పొందిందో, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలంటేనే వణుకు పుట్టే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గెలిచే పార్టీకి తప్పకుండా పోటీ ఉంటుందని తెలిపారు. బీ ఫారాలు అందుకున్న అభ్యర్థులకు సహకరించి వారి గెలుపునకు కృషి చేయాలని కోరారు.
డబ్బులున్నంత మాత్రానా టికెట్లు రావని మంత్రి ఈటల స్పష్టం చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్ రెండు పట్టణాలకు పార్టీల నుంచి బాధ్యులు వస్తారని తెలిపారు. తెరాస ఆధ్వర్యంలోనే ఈ రెండు పట్టణాలు సుందరమైన నగరాలుగా తీర్చిదిద్దుకోనున్నాయన్నారు.
- ఇవీ చూడండి : 'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'