తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో కరోనా సెకండ్​ వేవ్​కు ఆస్కారం ఉండకపోవచ్చు'

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మంత్రి ఈటల రాజేందర్​ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి... కరోనా సెకండ్​ వేవ్​పై మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా సెకండ్​ వేవ్​కు అంతగా ఆస్కారం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

By

Published : Dec 23, 2020, 6:16 PM IST

minister etela rajender on carona second wave in state
minister etela rajender on carona second wave in state

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పటి వరకు లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఈటల ప్రారంభించారు. ప్రపంచంలో బ్రిటన్‌ లాంటి దేవాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి వణికిస్తుందన్నారు. అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోవటం వల్ల లాక్‌డౌన్‌ విధించుకున్నారని వివరించారు. కరోనా సెంకడ్‌ వేవ్‌పై అంతగా భయపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌కు ఆస్కారం ఉండకపోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.

సకాలంలోనే వ్యాక్సిన్‌ వచ్చి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆకాక్షించారు. ప్రజలకు ఏమాత్రం లక్షణాలు ఉన్నా అన్ని వైద్యశాలల్లో పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నట్లు స్పష్టంచేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చల్లటి వాతావరణం ఉన్న దగ్గర మాత్రం కరోనా పెరిగే ఆస్కారం ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో చలి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ ప్రపంచ ప్రజలకు ఒక సవాలుగా మారిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వందలమంది చనిపోయినప్పటికీ... తెలంగాణలో గుండె ధైర్యంతో ఎదుర్కొని... మరణాల సంఖ్యను తగ్గించుకున్నామన్నారు.

ఇదీ చూడండి:ఈనెల 31కు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details