తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2021, 7:29 PM IST

Updated : Jan 20, 2021, 9:43 PM IST

ETV Bharat / state

బైడెన్​కు స్పీచ్​రైటర్​గా కరీంనగర్​ జిల్లా సంతతి వ్యక్తి

శ్వేతసౌధంలో మన తెలంగాణ సంతతి వ్యక్తి కీలక పదవిలో నియామకమయ్యాడు. అగ్రరాజ్యాధినేతకు స్పీచ్​ రైటింగ్​ డైరెక్టర్​గా బాధ్యతలు స్వీకరించాడు. 2012 నుంచే బైడెన్​తో అతిసన్నిహితంగా ఉన్న మన రాష్ట్ర సంతతి వ్యక్తి... ఇప్పుడు ఏకంగా శ్వేతసౌధం స్పీచ్​ రైటింగ్​ డైరెక్టర్​గా నియామకమయ్యాడు. కరీంనగర్​ జిల్లా పోతిరెడ్డిపేటకి చెందిన నారాయణ రెడ్డి మూడో కుమారుడు వినయ్​రెడ్డి... ఈ స్థానంలో ఉండటం పట్ల గ్రామస్థులు సంబురపడుతున్నారు.

karimnagar person appointed as speech writer to america president biden
karimnagar person appointed as speech writer to america president biden

బైడెన్​కు స్పీచ్​రైటర్​గా కరీంనగర్​ జిల్లా సంతతి వ్యక్తి...

కరీంనగర్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. అగ్రరాజ్య అధినేత జోబైడెన్‌ సలహాదారుల జాబితాలో జిల్లాలోని హుజురాబాద్​ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఉండటం విశేషం. శ్వేతసౌధం స్పీచ్‌ రైటింగ్‌ డైరెక్టర్‌గా చొల్లేటి వినయ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించటం పట్ల జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్​గా తమిళనాడు సంతతికి చెందిన కమలాహారీస్ ఎన్నిక కాగా... వైట్​హౌజ్​ స్పీట్​ రైటింగ్​ డైరెక్టర్​గా తెలంగాణ సంతతికి చెందిన వినయ్​రెడ్డి నియామకం కావటం ఇప్పడు ప్రాధాన్యం సంతరించుకుంది.

అప్పటి నుంచే...

గ్రామానికి చెందిన చొల్లేటి నారాయణరెడ్డి 1970లో అమెరికా వెళ్లి ఆక్కడే స్థిరపడ్డారు. నారాయణరెడ్డికి ముగ్గురు కుమారులు కాగా.. వినయ్​రెడ్డి మూడోవాడు. అమెరికాలో లా కంప్లీట్ చేసిన వినయ్​రెడ్డి మొదట యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్​కు స్పీచ్ రైటర్‌గా పని చేశారు. 2012 రీ ఎలక్షన్ సమయంలో ఒబామాకు, బైడెన్​కు స్పీచ్ రైటర్​గా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో బైడైన్, కమలా హారిస్​లకు స్పీచ్ రైటర్​తో పాటు ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడు వైట్​హౌజ్ స్పీచ్​ రైటింగ్​ డైరెక్టర్​గా నియామకమయ్యారు.

గ్రామంతో అనుబంధం...

నారాయణరెడ్డి... 1970లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్​ చేసి పీజీ చేసేందుకు అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడినా... స్వగ్రామాన్ని విస్మరించలేదు. గ్రామంలోని ఆస్తులను కూడా విక్రయించలేదు. 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు ఆయన పేరిటే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా నారాయణరెడ్డి... స్వగ్రామానికి వచ్చి ఊరితో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటుంటారు. పోతిరెడ్డిపేటలో చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించి సేవాగుణాన్ని చాటుకుంటారు.

తమ గ్రామంలో పుట్టి పెరిగిన నారాయణరెడ్డి కుమారుడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్​కు స్పీచ్​రైటర్​గా వ్యవహరిస్తుండటం పట్ల గ్రామస్తులు సంబరపడుతున్నారు. వినయ్​రెడ్డి వల్ల పోతిరెడ్డిపేటకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'శ్వేతసౌధ అధిపతి' కల సాకారం ఇలా...

Last Updated : Jan 20, 2021, 9:43 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details