కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి, రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏజెన్సీలు కనీస బాధ్యత వహించాలని అన్నారు. కేవలం లాభార్జన ధ్యేయంగా పని చేస్తూ రైతులను ఇబ్బంది పెడితే ఏజెన్సీలను మార్చేస్తామని హెచ్చరించారు. ధాన్యం తూకం పూర్తయిన వెంటనే రైతులకు రసీదులు ఇవ్వాలన్నారు. తాలు ధాన్యాన్ని యార్డులోనే గుర్తించి తూకానికి ముందే సరిచూసుకోవాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ - ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్ జిల్లా గర్షకుర్తి, దేశరాజుపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా పాలనాధికారి శశాంక సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ఏజెన్సీలు కనీస బాధ్యత వహించాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్