పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురిని కరీంనగర్ కలెక్టర్ శశాంక సస్పెండ్ చేశారు. గుత్తేదారుకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ చిల్కా లింగయ్య, కార్యదర్శి అరుణ్ కుమార్, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజుపై సస్పెన్షన్ వేటు పడింది. రుక్మాపూర్‌లో ఏర్పాటు చేసిన నర్సరీ, వైకుంఠధామం పనులను, కంపోస్ట్ షెడ్డు నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. పల్లె ప్రగతి పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురిపై సస్పెన్షన్
పల్లె ప్రగతి పనుల్లో అలసత్వం ప్రదర్శించిన ముగ్గిరిపై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో జరుగుతున్న పనులపై కలెక్టర్ శశాంక అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ కలెక్టర్, రుక్మాపూర్ పల్లె ప్రగతి పనులు
గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు పూర్తి కాకపోయినా... 75శాతం పూర్తైనట్లు అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. పారిశుద్ధ్య పనులు సరిగా లేవని అన్నారు. టెక్నికల్ అసిస్టెంట్‌ను కలెక్టర్ మందలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:CJI NV Ramana: 'అదే నా చిరకాల స్వప్నం'