కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దిగువ మానేరు నిండుకుండలా తొణికిసలాడుతోంది. జలాశయం సామర్థ్యమైన 24 టీఎంసీలను ఎప్పుడో దాటింది. ఇంకా ఎగువ నుంచి తుమ్మెద వాగు ద్వారా వరద ప్రవాహం జోరుగా వస్తుండగా జలాశయం నీటిమట్టం ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది. అధికారులు ఎప్పటికప్పుడు నీటి నిల్వను పరిశీలిస్తున్నారు.
నిండుకుండలా మానేరు.. 9 గేట్లు ఎత్తివేత!
కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దిగువ మానేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జలాశయం సామర్థ్యాన్ని మించి నీరు చేరి.. మానేరు నిండుకుండను తలపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
నిండుకుండలా మానేరు.. 9 గేట్లు ఎత్తివేత
ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయగా.. నీటి ప్రవాహాం పెరుగుతున్న కారణంగా.. ఉదయం 9 గేట్లను ఎత్తారు. ఒక్కో గేటు ద్వారా రెండు వేల చొప్పున తొమ్మిది గేట్ల ద్వారా 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో గ్రీన్ కవర్ 29 శాతానికి పెంచిన ఘనత మాదే: కేటీఆర్