రేపు జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో రానున్న 48 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. శశాంక పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా ఉండరాదని.. ఎన్నికల కోసం లాడ్జింగ్లు, ఇతర కమ్యూనిటీ హాళ్లు తీసుకోరాదని సూచించారు.
కరీంనగర్లో 144 సెక్షన్ అమలు - latest news on collector shashanka
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో రానున్న 48 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా పాలనాధికారి కె.శశాంక పేర్కొన్నారు.

కరీంనగర్లో 144 సెక్షన్ అమలు
ప్రజలు, పార్టీల కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి, ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చట్ట పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
కరీంనగర్లో 144 సెక్షన్ అమలు
ఇదీ చూడండి : భారత్‌లో పెట్టుబడులకు మొదటి మజిలీ తెలంగాణయే