ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్కు రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా 11 గంటల 30 నిమిషాలకు వేములవాడకు చేరుకుంటారని చెప్పారు. శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శించుకుని... మిడ్ మానేర్ సందర్శించి... మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ చేరుకుంటారని వివరించారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన - ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల
సీఎం కేసీఆర్ కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ రేపు మధ్యాహ్నం కరీంనగర్ వస్తారని మంత్రి తెలిపారు.
![సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన gangula kamalakar on cm tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5534051-thumbnail-3x2-gangula.jpg)
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల