లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు, వివిధ రకాల కార్మికులు ఆకలితో అలమటించకుండ భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు భాజపా కార్యకర్తలు 'ఫీడ్ ద నీడ్' కార్యక్రమాన్ని కరీంనగర్లో చేపట్టారు.
'ఫీడ్ ద నీడ్' కార్యక్రమం చేపట్టిన భాజపా నాయకులు - లాక్డౌన్
భాజపా నాయకులు కరీంనగర్లో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉంటున్న నిరుపేదలకు మధ్యాహ్న భోజనం, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.
'ఫీడ్ ద నీడ్' కార్యక్రమం చేపట్టిన భాజపా నాయకులు
జిల్లా అధ్యక్షులు శ్రీ భాషా సత్యనారాయణరావు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతాశిశు ప్రాంగణంలో సుమారుగా 270 మందికి మధ్యాహ్న భోజనం, అరటి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్కు సహకరించాలని.. సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని వారు సూచించారు.
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్