తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణిలో ఉద్యోగుల టిక్​టాక్​లు, వీడియో గేమ్​లు

ప్రజావాణి అంటే ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం. కానీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎంటర్​టైన్​మెంట్ ప్రోగ్రాం. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కలెక్టర్ సాక్షిగా టిక్​టాక్​లు, వీడియోగేమ్​లు ఆడుతూ టైమ్​పాస్ చేశారు.

ప్రజావాణిలో ఉద్యోగుల టిక్​టాక్​లు, వీడియో గేమ్​లు

By

Published : Jul 9, 2019, 3:03 PM IST

ఒకరు టిక్​టాక్​లో వీడియోలు చూస్తున్నారు. ఇంకొకరు వీడియో గేమ్​లో మునిగిపోయారు. ఇదేదో బస్టాపో రైల్వే స్టేషనో కాదు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో ప్రతి సోమవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిమగ్నమై ఉంటే కార్యాలయ సిబ్బంది మాత్రం ఇలా టైమ్​పాస్ చేశారు.

ప్రజావాణిలో ఉద్యోగుల టిక్​టాక్​లు, వీడియో గేమ్​లు
విద్యుత్ శాఖకు చెందిన ఏఈ ఇదిగో ఇలా టిక్​టాక్​ చూస్తుంటే... రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి వీడియో గేమ్​లో మునిగిపోయారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజావాణి దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీతాలిస్తుందని ఇందుకేనా అని మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details