పుర ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ కరీంనగర్లో ముమ్మురంగా ప్రచారం సాగిస్తోంది. ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి నిధులు తెచ్చె దమ్ము మంత్రులకు లేదని... సీఎం ఏదీ చెబితే అది అన్నట్లు పాలన సాగుతుందని మేయర్ అభ్యర్థి ప్యాట రమేశ్ విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. తెరాస హయాంలో డ్రగ్స్ మాఫియా, దొంగతనాలు పెరిగిపోయాయని మత కలహాలను ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు.
'కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి' - కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని మేయర్ అభ్యర్థి ప్యాట రమేశ్ పేర్కొన్నారు. రోడ్లు, ఆసుపత్రి, నీళ్ల ట్యాంకుల నిర్మాణం తమ ప్రభుత్వమే చేపట్టిందని.... తెరాస వాళ్ల కేవలం పైపై మేరుగులద్ది చేసిందంతా తామే అని చెప్పుకోవటం శోచనీయమని పేర్కొన్నారు.
'కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి'
పట్టణంలోని ప్రధాన రహదారి డివైడర్లు వేయటానికి ఆరు సంవత్సరాల సమయం కావాలా ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగం పెరిగిపోయిందని... హామీల అమలులో తెరాస పూర్తిగా విఫలమైందని విమర్మించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెరాసకి బుద్ధి చెప్పాలని ప్యాట రమేశ్ పేర్కొన్నారు.