కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెండు పడకల గదులు ఇళ్లు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని జిల్లా పార్టీ అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి ఆరోపించారు.
ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని భాజపా ధర్నా
రెండు పడకల గదులు ఇళ్లు ఇస్తామని మభ్యపెట్టి.. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని భాజపా కరీంనగర్జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు.
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కోరుతూ.. జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి.. తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతుంటే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బు దండుకొనే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:గోడు వినకుండా.. పొట్ట కొట్టారు..!