కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గోలముడి సోమయ్య అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల సోమయ్య, అతని ఇద్దరు కుమారులు, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, పిల్లలకు తీవ్ర గాయాలు - updated news on The gas cylinder exploded causing serious injuries to father and children
గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, పిల్లలకు తీవ్ర గాయాలు
స్థానికులు క్షతగాత్రులను వెంటనే జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమయ్య గ్రామ శివారులో గల ఇటుకల బట్టీలో పనిచేస్తారు.